తెలంగాణలో కరెంట్ రాజకీయం

రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టబోతుంది. ఇదే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఉచిత విద్యుత్ అంశం ఫై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు , రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన అంశం ఫై రేవంత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా తాము బుధవారం సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని, దీనిని నీరుగార్చేందుకు బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశంతో రాద్ధాంతం చేస్తూ కుట్రకు తెరలేపిందని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని దీనిని బట్టి మరోసారి తేలిపోయిందన్నారు. సత్యాగ్రహ దీక్షని నీరుగార్చడానికి బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశాన్ని తెరపైకి తెచ్చి, దృష్టి మరలించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి..రైతులకు వద్దా

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని, ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్‌ ఎందుకు అన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ గారు..తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ వ్యాఖ్యలపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌దిః మంత్రి కెటిఆర్

ఉచిత విద్యుత్ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాకరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార బిఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మంగళవారం స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని మండిపడ్డారు. గతంలోనూ రైతులకు విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎనిమిది గంటల విద్యుత్ మాత్రమే ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పడం ద్వారా ఆ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు మరోసారి వెల్లడయ్యాయన్నారు.

 కాంగ్రెస్‌కు క‌రెంట్ షాకివ్వాలి – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని, ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్‌ ఎందుకు అన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రేవంత్ దిష్టిబొమ్మలను తగలబెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ శ్రేణులు సైతం రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని నిప్పులు చెరిగారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడాని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలి. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి అని హ‌రీశ్‌రావు రైతుల‌కు సూచించారు.

 

Leave a Reply

%d bloggers like this: