తెలంగాణ బిడ్డకు 30 కోట్ల లాటరీ

తెలంగాణకు చెందిన యువకుడికి రూ. 30 కోట్ల లాటరీ రూపంలో అదృష్టం వరించింది. దీంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏకంగా రూ. 30 కోట్ల లాటరీ తగలడంతో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సామాన్య యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్‌కు చెందిన ఓగుల దేవరాజం బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ 15 దిర్హమ్స్‌‌తో రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అయితే, డ్రాలో లాటరీ తీయగా అదృష్టం అతడ్నే వరించింది. ఓ టికెట్‌లో 1.50 కోట్ల దిర్హమ్స్‌‌ను అజయ్ గెలుచుకున్నాడు. దీని విలువ ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.30 కోట్లు. ఈ విషయాన్ని అజయ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు కూడా ఆనందంలో మునిగిపోయారు.
కాగా, ఇప్పటికి తాను జాక్ పాట్ కొట్టినట్టుగా నమ్మలేకపోతున్నానని అన్నాడు అజయ్. అంతేగా, ఈ మొత్తంలో కొంత కుటుంబానికి వెచ్చించి, మిగతా డబ్బుతో సొంత ప్రాంతంలో ఉంటూ వ్యాపారం చేస్తానని అజయ్‌ చెప్పుకొచ్చాడు.

Leave a Reply

%d