ఆపకుండా ఏడు రోజులు ఏడ్చేశాడు… చివరికి

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు సంపాదించడం చాలా పెద్ద విషయం. కానీ, దాని కోసం చాలా కష్టపడాలి. చాలా మంది ఇలాంటి అద్భుతమైన విన్యాసాలు, సాహసాలు చేస్తారు. వాటి గురించి వింటే కొన్ని కొన్ని సార్లు గూస్‌బమ్స్‌ వస్తాయి. అదేవిధంగా ఒక నైజీరియన్ వ్యక్తి కూడా అలాంటి పనినే చేశాడు. ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించేందుకు గానూ అతడు 7 రోజుల పాటు నిరంతరంగా ఏడ్చాడు. ఏడు రోజులు ఏకదాటిగా ఏడవడం అంత సులభం కాదు. కానీ, గిన్నిస్‌ వరల్డ్‌లో తన పేరు నమోదు చేసుకునేందుకు నైజీరియాకు చెందిన అతడు.. ఇలా చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం బిత్తరపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే. ఏడు రోజుల పాటు ఏడవడం గురించి ఎవరూ ఆలోచించి ఉండరు.. ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఒక వ్యక్తి రోజులో వివిధ భావోద్వేగాలతో వెళతాడు. అలాంటి పరిస్థితుల్లో రోజంతా నవ్వడం, ఏడవడం, మాట్లాడుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ రికార్డ్ చేయడం అంటే ఇతరులకు ధైర్యం లేని, చేయలేని పని చేయడం. నైజీరియాలో ఒక వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టాలనే ఆశతో ఏడు రోజుల పాటు బలవంతంగా ఏడ్చాడు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, టెంబు ఎబెరే అనే వ్యక్తి తన ఈ ప్రయత్నంలో కొంతకాలం తర్వాత అతని కంటి చూపును కోల్పోయాడు. ప్రపంచ రికార్డు కోసం ఒక వారం మొత్తం నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించినందున ఇలా జరిగింది. వారం రోజుల పాటు నిరంతరాయంగా కన్నీళ్లు కార్చినందుకు ఫలితంగా మొదట అతను పాక్షికంగా తలనొప్పి, ముఖం వాయటం, ఉబ్బిపోయిన కళ్లతో బాధపడ్డాడు. అయినప్పటికీ, అతను సవాలును పూర్తి చేయలేకపోయాడు. వాస్తవానికి, అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేయలేదు. కాబట్టి వారు దానిని లెక్కించలేదు. దీంతో అతడు చేసింది వృద్ధా ప్రయత్నంగా మిగిలిపోయింది. హాస్యనటుడిగా చెప్పుకునే ఎబెరే, @237_towncryer వినియోగదారు పేరుతో TikTokలో తన ప్రయత్నాలను పంచుకున్నారు. అతను అనుచరులతో, “మీ సమస్యలను నాకు పంపండి, నేను మీ కోసం ఏడుస్తాను.” అనే క్యాప్షన్‌తో వీడియో వైరల్‌గా మారింది. 5.3 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.

Leave a Reply

%d