ఐఐపిఏ అమెజాన్ ఒప్పందం కుదిరింది

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA) మరియు అమెజాన్ ఇండియా నేడు పలు సంయుక్త కార్యక్రమాలకు సహకారాన్ని అందించుకునేందుకు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా వినియోగదారులకు ఆన్‌లైన్‌లో ఎక్కువ నమ్మకంతో షాపింగ్ చేసేందుకు సాధికారత దక్కుతుంది. ఆన్‌లైన్ వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహనను మెరుగుపరచడంతో పాటు సురక్షితమైన షాపింగ్ పద్ధతులపై అవగాహన పెంచేందుకు, వంచకుల నుంచి  ఆన్‌లైన్ షాపర్లను రక్షించే దిశలో సహకారాన్ని అందించేందుకు అంగీకరించుకుని, ఈ రెండు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. “అమెజాన్ సెంటర్ ఆఫ్ కన్సూమర్ స్టడీస్ తరపున ఐఐపిఏ (IIPA)తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉంది. సురక్షితమైన షాపింగ్ వాతావరణాన్ని సృష్టించడం అనేది మా మార్కెట్‌ప్లేస్‌లో వినియోగదారుని నమ్మకాన్ని గెలుచుకుని, దాన్ని నిలుపుకోవడం చాలా కీలకమైన అంశం. ఈ దిశలో పురోగమించడానికి ఐఐపిఏ వంటి సారూప్య సంస్థలతో సహకారం చాలా కీలకమని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. ఆన్‌లైన్ షాపర్లకు ఒక సురక్షితమైన, నమ్మదగిన అనుభవాన్ని అందించేందుకు అమెజాన్‌కే కాకుండా మొత్తం ఇ-కామర్స్ పరిశ్రమకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని మేము ఆశిస్తున్నాము’’ అని అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు చేతన్ కృష్ణస్వామి పేర్కొన్నారు.

Leave a Reply

%d