చంచల్ గూడ జైల్లో షర్మిల

విధులలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన కేసులో వైఎస్ షర్మిల పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు  షర్మిల కు 14 రోజుల జ్యూడిషియల్ రీమాండ్ విధించింది. మే 8 వరకు రీమాండ్ విధించారు.  రీమాండ్ విధించిన నేపద్యంలో వైఎస్ షర్మిల ను చంచల్ గూడ మహిళ జైలుకు తరలించారు.
అయితే ఇది పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడమేనని అంటున్నారు పార్టీ నేతలు. విపక్ష పార్టీలను ఎదుర్కొనలేక అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు పార్టీ నాయకులు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న తరుణంలో అడ్డుకొని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.

Leave a Reply

%d