కర్నూలు జిల్లాలో పులి పిల్లల కలకలం రేగింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పెద్దపులి పిల్లలు దారి తప్పి ఓ గ్రామంలోకి వచ్చాయి. అయితే గ్రామ ప్రజలు ఏ మాత్రం జంకకుండా వాటిని ఓ గదిలో పెట్టి గంప కింద కమ్మెశారు. వివరాల్లోకి వెళ్తే… జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో… రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు. పులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్‌కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్‌ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు.
గ్రామంలోకి పులి పిల్లలు గంప కింద కమ్మిన ప్రజలు
