మంచు సోదరుల గొడవకు కారణం వారికే తెలుసు

ఇటీవల తన సోదరుడు మంచు విష్ణు బంధువుల ఇళ్లపై ఇలా దాడులు చేస్తుంటాడు అని మంచు మనోజ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలిసిందే. దాంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కాయి. మనోజ్ రిలీజ్ చేసిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై మనోజ్ స్పందిస్తూ, ఓ మీడియా చానల్ పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.  వీడియో గురించి తనకంటే ఆ చానల్ కే మరింత తెలుసని, వాళ్లను అడిగితే చాలా విషయాలు చెబుతారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక ఈ వీడియో గురించి నన్ను అడగొద్దు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇటీవల మంచు విష్ణు వాగ్వాదం జరుపుతున్న వీడియోను పంచుకున్న మనోజ్… కొద్దిసేపటికే దాన్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు.

Leave a Reply

%d