తిరుమలలో చిరుత మళ్లీ హల్ చల్ ఆందోళనలో భక్తులు

తిరుమలలో చిరుత మళ్లీ కనిపించింది. భక్తులను భయపెడుతోంది. లక్షిత అనే చిన్నారిని చిరుత చంపిన ఘటనతో టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇవాళ నడకమార్గంలో మళ్లీ చిరుత కనిపించింది. మెట్ల దగ్గరకు చిరుత రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. నడకదారిలో చిరుత కనిపించింది. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భక్తులు భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు.100 మందికి కలిపి ఒక గుంపుగా పంపిస్తుండగా వారికి పైలట్‌గా ఒకరిని నియమిస్తున్నారు. అటు చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయింది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ మీటింగ్ జరగనుంది. కాలినడక మార్గాల,ఘాట్‌లలో యాత్రికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుందని తెలుస్తోంది…

Leave a Reply

%d