ఫ్రిబవరి 14న పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మళ్లీ విడుదల

పవన్‌కల్యాణ్‌ వాలంటైన్స్‌ రోజున అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికీ ‘జల్సా’, ‘ఖుషి’ రీ రిలీజ్‌లతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజును క్లాసిక్‌ లవ్‌స్టోరీ ‘తొలిప్రేమ’ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌లో విడుదల చేసి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారట. పవన్‌కల్యాణ్‌ వాలంటైన్స్‌ రోజున అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికీ ‘జల్సా , ‘ఖుషి’ రీ రిలీజ్‌లతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజును క్లాసిక్‌ లవ్‌స్టోరీ ‘తొలిప్రేమ’ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌లో విడుదల చేసి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారట. ఇప్పటికే దానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారట మేకర్స్‌. ఎ.కరుణాకరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పవన్‌ను స్టార్‌ హీరోగా నిలబెట్టింది. అందులో పవన్‌ నటన, పాటలు, భావోద్వేగాలు, వినోదం ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకూ చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు పొందిన పవన్‌ ‘తొలిప్రేమ’తో ఓన్‌ ఐడెంటిటీ తెచ్చుకున్నారు. తనకంటూ ఓ స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిందీ చిత్రం. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తదుపరి హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు.

 

Leave a Reply

%d bloggers like this: