ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి డబ్బులు జమ

వరుసగా పది రోజులు పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నారు. బుధవారం (28.06.2023) పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో బటన్ నొక్కి సీఎం జగనన్  నిధులు  జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా 15,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిచింది. తాజాగా అందిస్తున్న రూ.6,392.94 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం “జగనన్న అమ్మఒడి” అనే ఈ పథకం క్రింద మాత్రమే జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి  రూ. 26,067.28 కోట్లు కావటం విశేషం. పేదరికమే అర్హతగా కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పారదర్శకంగా, లంచాలకు వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం పని చేస్తోంది.

Leave a Reply

%d