రాష్ట్రంలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులు, వడగళ్లు రాష్ట్ర ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మరోరెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.