పేటీఎంలో సగం ధరకే టమాటాలు

టమాట ధరలు చుక్కలనంటుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించిది. భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ (ఓఎన్‌డీసీ) ద్వారా టమాటాలు సగం ధరలకే అమ్ముతుంది. ఈ ఫ్లాట్ ఫామ్ లో ఉన్నటువంటి పేటీఎం, మ్యాజిక్ పిన్, మై స్టోర్, పిన్ కోడ్ యాప్స్ ద్వారా కిలో టమాటా రూ.70 అమ్మతున్నట్లు ఎన్‌సీసీఎఫ్ ప్రకటించింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో ఉన్న ప్రజలు ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో సబ్సిడీ కింద టమోటాలను ఆర్డర్ చేయవచ్చు. ఒక కస్టమర్ కి వారానికి రెండు కిలోలు మాత్రమే ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా కస్టమర్లకు కూడా టమాటాలు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టమాటాలు కావాల్సిన వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 నిమిసాల మధ్య ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అలా ఆర్డర్ చేసిన వారికి మరుసటి రోజు ఉచితంగా డెలివరీ చేస్తారు. ఈ విషయం గురించి ఎన్‌సీసీఎఫ్‌ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర మాట్లాడుతూ.. ఇటీవల టమాటా ధరలు బాగా పెరిగిపోవడంతో వినియోదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో సబ్సిడీ రేటుకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నామని.. పేటీఎం, మ్యాజిక్‌పిన్, మైస్టోర్, పిన్‌కోడ్ ఆప్షన్స్‌లో ఒకదానిపై క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది.. ఫుడ్ పేజీలో కిలో టమాటా కేవలం రూ.70కే ఆర్డర్ చేయవచ్చన్నారు. ఒక్కసారి ఆర్డర్ కి 2 కిలోల వరకు మాత్రమే పరిమితం ఉంటుందని అన్నారు. కాగా, ఈ-కామర్స్ కంపెనీలు కిలోకు రూ.170-180 చొప్పున డోర్ సేఫ్ట్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: