ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

ఎర్రగడ్డ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంటుందనే సంగతి తెలిసిందే. అటువంటి ఎర్రగడ్డ వద్ద ఇప్పుడు మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించింది జీహెచ్ఎంసీ. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లోని ఎజి కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెజ్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. దీంతో రేపటి నుండి ( మార్చి 28 ) జూలై 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా…

  • కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వైపు వచ్చే ప్రయాణికులు కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ యూ టర్న్‌ తీసుకుని ఎడమవైపుగా ఐడిఎల్‌ లేక్‌ రోడ్‌, గ్రీన్‌ హిల్స్‌ రోడ్‌ కావూరి హిల్స్ , నీరూస్ జంక్షన్ , జూబ్లీ చెక్ పోస్ట్ , యూసుఫ్‌గూ, మైత్రివనం మీదుగా అమీర్ పేటకు వెళ్లాలి
  • కూకట్‌పల్లి నుండి బేగంపేట వైపు వచ్చే ప్రయాణికులు కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి బాలానగర్ ఫ్లైఓవర్ మీదుగా న్యూ బోవెన్‌పల్లి, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి బేగంపేట ఫ్లైఓవర్ ఎక్కాలి.
  • మూసాపేట్ & గూడ్‌షెడ్ రోడ్డు నుండి అమీర్‌పేట వైపు వచ్చే ప్రయాణికులు ఐడిఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్ , రెయిన్‌బో విస్టాస్ , ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పార్వత్‌నగర్ , టోడీ కాంపౌండ్ , కావూరి హిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్ , యూసుఫ్‌గూడ రోడ్డు మీదుగా మైత్రివనం, అమీర్‌పేటకు వెళ్లాలి
  • బాలానగర్‌ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చే ప్రయాణికులు బాలానగర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా న్యూ బోయిన్‌పల్లి జంక్షన్‌, తాడ్‌బండ్‌ ,ప్యారడైజ్‌ జంక్షన్‌ , బేగంపేట్‌ ఫ్లై ఓవర్‌ నుంచి అమీర్‌పేటకు వెళ్లాలి. దీనిని నగరవాసులు గమనించగలరని పేర్కొన్నారు.

Leave a Reply

%d