మెగా కుటుంబంలో మరో విడాకులా ?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఇంట ఆడపడుచుల విషయంలో ఇంటి పెద్ద చిరంజీవి, నాగబాబు కాస్త మానసిక బాధకు గురైనట్లు తెలుస్తోంది. ఎంతో అంగరంగ వైభంగా కూతుర్ల పెళ్లిళ్లు చేసి వారిని పదికాలాల పాటు చల్లగా ఉండాలని దివించారు. అయితే ఇప్పుడు అమ్మాయిలు, అల్లుళ్ల మధ్య వస్తున్న భేధాభిప్రాయాల వల్ల విడాకుల వరకు వెళ్తున్నారు. గతంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కుటంబ జీవితం గురించి తెలిసిందే.  శ్రీజ, కల్యాణ్ దేవ్‌లు విడిపోయినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయం చెప్పడం లేదు కానీ.. దాదాపు వారిద్దరూ విడిపోయినట్లే అనిపిస్తుంది. కల్యాణ్ దేవ్ పెట్టే పోస్ట్‌లు చూస్తుంటే.. అతను శ్రీజ లైఫ్‌‌లో నుంచి బయటికి వచ్చినట్లుగా క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే శ్రీజ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు ఎవరికీ అర్థం కాకుండా ఉన్నాయి. వారి విషయం అలా ఉంటే.. ఇప్పుడు మరో మెగా డాటర్ నిహారిక లైఫ్ కూడా సవ్యంగా ఉన్నట్లు కనిపించడం లేదు. వారిద్దరు కూడా విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా ఇప్పటికే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు వారిద్దరూ చేసిన పనితో.. అది నిజమే అనేలా అందరికీ తెలిసిపోయింది. అదెలా అంటే.. తాజాగా వారిద్దరూ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌లో ఒకరినొకరు ఆన్ ‌ఫాలో చేసుకున్నారు. అంతే కాదు, ఇద్దరూ వారి పెళ్లి ఫొటోలను తొలగించారు. దీంతో కొన్ని రోజులుగా వారి వివాహబంధంపై వినిపిస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లయింది. ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి మరో విడాకుల మ్యాటర్ వచ్చే అవకాశం ఉందనేలా టాక్ మొదలైంది. వాస్తవానికి నిహారిక, చైతన్య జొన్నలగడ్డ చాలా ప్రేమగా ఉంటారనే విషయం.. పెళ్లి తర్వాత వారు పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తే అర్థమైంది. పెళ్లి తర్వాత.. భర్త, ఫ్యామిలీ మాటకు గౌరవం ఇచ్చి.. నిహారిక కూడా నటనకు స్వస్తి చెప్పింది. తన భర్తతో కలిసి సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేసింది. ఆ మధ్య తన భర్త విషయంలో ఏదో గొడవ జరిగితే.. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి కూడా షిఫ్ట్ అయ్యారు. అంతా సవ్యంగానే జరుగుతుంది.. త్వరలోనే నిహారిక గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందనే సమయంలో.. సడెన్‌గా ఇలాంటి వార్తలు వినాల్సి రావడం నిజంగా విడ్డూరమే. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందనే విషయం కానీ, అసలు వారిద్దరూ ఎందుకు సోషల్ మీడియాలో ఆన్ ఫాలో చేసుకున్నారనేది గానీ తెలియాలంటే ఇరు ఫ్యామిలీలకు సంబంధించిన ఎవరో ఒకరు మీడియా ముందుకు రావాల్సిందే.. లేదంటే అప్పటి వరకు ఈ రూమర్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. చూద్దాం.. ఈ మెగా డాటర్ విషయంలో ఏం జరగబోతోందో?

Leave a Reply

%d