పొంగులేటిని పక్కన పెడుతున్న తెలంగాణ సర్కార్

మాజీ ఎంపీ, ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆయనకు 3+3 గన్‌మెన్లు ఉండేవారు. ప్రస్తుతం 2+2కి కుదించారు. అటు, పొంగులేటి క్యాంప్ కార్యాలయం వద్ద పైలెట్ సెక్యూరిటీని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించారు. ఇంటి దగ్గర ఉండే భద్రతా సిబ్బందిని కూడా తగ్గించారు. ఇలా ఒకేసారి ఆయన సెక్యూరిటీని తగ్గించడం ఏంటి అని ఆయన అభిమానులంతా మాట్లాడుకుంటున్నారు. అయితే దీని వెనుక ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నెల 01 న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు.

Leave a Reply

%d