కోడలిపై మనసుపడ్డ మామ

ఈ మధ్యకాలంలో పెళ్లైన కొంతమంది మగాళ్లు కట్టుకున్న భార్యను కాదని పరాయి మహిళలపై మనసుపడుతున్నారు. ఇక మేమేం తక్కువ కాదన్నట్లుగా కొందరు మహిళలు కూడా పక్కింటి, ఎదురింటి వ్యక్తులపై మోజు పడుతూ చివరికి వివాహేతర సంబంధాలు నడిపిస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి తన సొంత కోడలిపైనే కన్నేశాడు. సమయం దొరికితే చాలు కోడలి బెడ్ రూంలోకి దూరిపోతూ ఎంజాయ్ చేశాడు. ఇక అసలు విషయం కొడుకుకి తెలియడంతో తండ్రికి ఊహించని షాకిచ్చాడు. అసలేం జరిగిందంటే?

For More News Click: https://eenadunews.co.in/

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ సియోని పరిధిలోని భూత్ బంధాని గ్రామం. ఇక్కడే సంజయ్ ధుర్వే అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ యువతితో వివాహం జరిగింది. అయితే సంజయ్ తో పాటు అతని తండ్రి దరోగ్ సింగ్ కూడా ఉండేవాడు. అలా వీళ్లు ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. అయితే కొడుకు ఉదయం ఉద్యోగానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇకపోతే.. కోడలు ఎర్రగా, బుర్రగా ఉండడంతో మామ ఆమెపై కన్నేశాడు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా కోడలితో కోరికలు తీర్చుకోవాలని తహతహలాడాడు. మామ కొన్నాళ్లు కోడలిని చూస్తూ చూస్తూ మొత్తానికి ఆమెను తన ముగ్గులోకి దింపుకున్నాడు.

For More News Click: https://eenadunews.co.in/

కోడలు కూడా మామతో సరసాలకు సై అంటూ గ్రీన్ సిగ్నల్. ఇక ఇంకేముంది.. కొడుకు లేని లేని టైమ్ లో తండ్రి ఏకంగా కోడలి బెడ్ రూంలోకి దూరి అందమైన కోడలితో రొమాన్స్ కు తెర లేపాడు. అలా వీరి చీకటి కాపురం కొన్నాళ్ల పాటు విజయవంతంగా కొనసాగింది. కాగా, కొడుకు సంజయ్ కు ఎందుకో తన తండ్రి ప్రవర్తనపై కాస్త అనుమానం కలిగింది. ఏం జరుగుతుందని ఓ కన్నేసి ఉంచాడు. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత సంజయ్ అనుమానం నిజమే అని తెలిసింది. దీనికి తన భార్య కూడా తండ్రికి సపోర్ట్ గా ఉందని తెలుసుకున్నాడు. దీంతో సంజయ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి దరోగ్ సింగ్ ని సంజయ్ హత్య చేయాలని ప్లాన్ వేశాడు.

For More News Click: https://eenadunews.co.in/

ఇక ఇందులో భాగంగానే ఇటీవల ఓ రోజు నీతో మాట్లాడాలంటూ తన తండ్రిని ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇదే విషయమై తండ్రీ కొడుకులు గొడవకు దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన సంజయ్.. తండ్రి దరోగ్ సింగ్ ను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు అంతా గమనించిన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంజయ్ ధుర్వేని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

 

 

Leave a Reply

%d