స్నేహితురాలితో శృంగారం! ఇద్దరూ ఏకంగా అడవిలోకి వెళ్లి!

ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ లో ఓ యువతి తన స్నేహితురాలిని గాఢంగా ప్రేమించింది. ఇందుకోసం పురుషుడిగా మారాలని భావించి ఓ మాంత్రికుడిని ఆశ్రయించింది. నమ్మి వెళ్లిన పాపానికి ఆ వ్యక్తి ఆమెను బలితీసుకున్నాడు. ఆర్సీమిషన్ పరిధిలో ఉంటున్న పూనమ్ ఏప్రిల్ 18 నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయంపై ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు మే 18న లఖీంపురా పరిధిలో ఓ యువతి అస్తిపంజరం పోలీసులకు లభ్యమైంది. ఆ అస్తిపంజరం శాంపిల్ ల్యాబ్ కి పంపగా అది పూనమ్ దే అని నిర్ధారణ అయ్యింది.

పోలీసుల కథనం ప్రకారం.. పువాయులో ఉంటున్న ప్రీతి, పూనమ్ లు స్వలింగ సంపర్కులు. పూనమ్ తన స్నేహితురాలైన ప్రీతిని గాఢంగా ప్రేమించేది.. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని తన మనసులోని కోరిక ప్రీతితో చెప్పింది. ఈ కారణంతోనే ప్రీతికి పెళ్లి సంబంధాలు రాకుండా పోయాయి.. దీంతో ప్రీతి తల్లి పూనమ్ పై కోపం పెంచుకుంది. తన అడ్డు తొలగిస్తే కానీ ప్రీతి పెళ్లి కాదని భావించింది. ఈ క్రమంలోనే పూనమ్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రీతి తల్లి ఊర్మిళ. ఈ క్రమంలో లఖీంపూర్ లో ఉంటున్న రామ్ నివాస్ అనే ఓ రౌడీ షీటర్ ని కలిసింది. తన కూతురు పెళ్లికి పూనమ్ అడ్డు వస్తున్న విషయం గురించి చెప్పింది. ఆమెను చంపేస్తే రెండున్నర లక్షలు ఇస్తానని.. మొదట ఐదు వేల అడ్వాన్స్ ఇచ్చింది.

రామ్ నివాస్ ప్రీతి, పూనమ్ లను అడవికి తీసుకు వెళ్లి వారిద్దరి పెళ్లి గురించి మాట్లాడాడు. తన మనసులోని కోరిక గురించి పూనమ్ చెప్పడంతో రామ్ నివాస్ తనకు మంత్ర విద్యలు తెలుసునని.. నిన్ను పురుషుడిగా మారిస్తే మీ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఉండవని పూనమ్ ని నమ్మించాడు. అతని మాయమాటలో పడిపోయింది పూనమ్. ఈ క్రమంలోనే మరోసారి పూనమ్ ని ఒంటరిగా అడవిలోకి రమ్మన్నాడు రామ్ నివాస్. ముందుగానే తన వద్ద ఉన్న ఆయుధాలతో పూనమ్ పై దాడి చేసి చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని పొదల్లో దాచిపెట్టాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పూనమ్ అస్తి పంజరం దొరికింది. ఆమె సోదరుడు పూనమ్ ధరించిన దుస్తులను చూసి గుర్తు పట్టాడు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పపడ్డ రామ్ నివాస్, ప్రీతిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఊర్మిళ పరారీలో ఉన్నదని త్వరలో ఆమెను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

%d