వరుస ఓటముల్లో గుజరాత్

మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్ రెండో ఓటమి ఎదురైంది.  ఈ మ్యాచ్లో 3  వికెట్ల  తేడాతో యూపీ విజయం సాధించింది.  170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్..19.5  ఓవర్లలో 7 వికెట్లకు 175  పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్..20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.  హరీన్ డియోల్ 32 బంతుల్లో, ఏడు ఫోర్లతో 46 పరుగులు చేయగా..ఓపెనర్ సబ్బినేని మేఘన 24 పరుగులు, గార్డెనర్ 25 పరుగులు, దయాళన్ హేమలత 21 పరుగులతో రాణించారు.  యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంజలీ శర్వాని, తహ్లియా మెక్ గ్రాత్ ఒక్కో వికెట్ తీశారు.

ఆ తర్వాత 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్..19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175  పరుగులు చేసింది. కిరణ్ నేవ్ గిర్  43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు సాధించింది.  గ్రేస్ హార్రిస్ 26  బంతుల్లో 7 ఫోర్లు, 3  సిక్సర్లతో 59  పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించింది. ఆమెకు  సోఫియా 12 బంతుల్లో ఓ సిక్సు, ఓ ఫోర్ తో 22 పరుగులు చేసి సహకరించింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు తీయగా..అన్నాబెల్ సుదర్లాండ్ , మాన్సి జోషీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Leave a Reply

%d bloggers like this: