ఆ హీరోయిన్ రేటు చాలా కాస్ట్లీ గురూ

సినీ పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్‌కి సపరేటు క్రేజ్ ఉంటుంది. అందుకే దర్శకులు వారి సినిమాల్లో అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటారు. ఏ హీరోయిన్‌తో, లేదా బ్యూటీతో ఆ పాట చేయిస్తే జనాలకు రీచ్ అవుతుందో.. ప్రజెంట్ ట్రెండింగ్ స్టార్ ఎవరో వెతికి పట్టుకుని మరీ ఎంపిక చేసుకుంటారు. ఈమధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ చేసే నటీమణులు.. హీరోయిన్లకి ఏ మాత్రం తగ్గకుండా పారితోషికం అందుకుంటున్నారు. ఇక ఇలాంటి సాంగ్స్ చేసే హీరోయిన్స్ కూడా సినిమాల కంటే ఎక్కువగా.. కేవలం ఒక్క పాటకే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో ‘బాసు వేర్ ఈజ్ ది పార్టీ’ అంటూ చిరంజీవితో చిందేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.

రీసెంట్‌‌గా ‘బ్రో’ మూవీలో నుండి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్‌లో మెగా మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్‌లతో కలిసి ఆడి పాడింది. బోయపాటి,రామ్ కాంబోలో రానున్న ‘స్కంద’ చిత్రంలో కూడా ప్రత్యేక గీతంలో మెరవనుంది. హీరోయిన్స్ నెలల తరబడి చేస్తే వచ్చే రెమ్యునరేషన్.. ఐటెమ్ గర్ల్స్ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయ్యే ఒక్క పాటకు తీసుకుంటారు. ఈ విషయంలో ఊర్వశి రౌతేలా ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. తాజాగా ఆమె గురించి ప్రచారం అవుతున్న వార్త ఒకటి సినీ లవర్స్‌ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ నిమిషాని అక్షరాలా కోటి రూపాయలు వసూలు చేస్తుందట.

దర్శకుడు బోయపాటి శ్రీను – రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం ‘స్కంద’ లో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. మూడు నిమిషాల నిడివి ఉండే ఈ పాటకు ఊర్వశి ఏకంగా రూ. 3 కోట్లు తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ మొదలైంది. 3 కోట్లంటే.. ఈ ఫిగర్, ఓ స్టార్ హీరోయిన్ పూర్తి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ అన్నమాట. శరవణన్ స్టోర్స్ అధినేత అయిన అరుళ్ శరవణన్ హీరోగా చేసిన ‘ది లెజెండ్’ మూవీలో నటించింది. అందులో నటించినందుకు కూడా భారీ పారితోషికం తీసుకుందని న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క పాటకు రూ. 3 కోట్లు తీసుకుంటున్న ఈ అమ్మడు రాబోయే సినిమాలకు ఇంకెన్ని కోట్లు డిమాండ్ చేస్తుందో మరి.

Leave a Reply

%d