వెంకీ మామ 75 సినిమా ఇదే

విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రం ఫిక్స్ అయ్యింది. హిట్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. మూవీ మొఘల్ డి రామానాయుడు కుమారుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వెంకటేష్..అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. విక్టరీ నే తన ముందు పెట్టుకొని విక్టరీ వెంకటేష్ గా వరుస విజయాలు అందుకుంటూ వచ్చారు. ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించిన వెంకీ..తాజాగా తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘హిట్2’తో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శైలేష్ కొలనుతో ఆయన ఈ చిత్రాన్ని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్నారు. ఈ విషయాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్ సోమవారం వెల్లడించింది. ప్రీలుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. చొక్కమడిచి విస్పోటనానికి ఎదురు వెళ్తున్నట్టుగా ఉన్న వెంకీ బ్యాక్ షాట్ పోస్టర్ చూస్తే ఇది యాక్షన్ సినిమాలా కనిపిస్తోంది. ఇక ఈ నెల 25 న ఈ మూవీ ప్రకటన ఉంటుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు..కథ ఎలాంటిది అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

%d