రానాా నాయుడుపై ఫైరైన రాములమ్మ

థియేటర్‌లో విడుదలయ్యే ప్రతి సినిమాకి కచ్చితంగా సెన్సార్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నియమించిన బోర్డు మూవీలో అసభ్యత లేకుండా చూసి విడుదలకి సర్టిఫీకెట్‌ని జారీ చేస్తుంది. అయితే.. ఓటీటీ (OTT) పరిస్థితి వేరు. అందులో వచ్చే కంటెంట్‌కి ఎటువంటి పరిమితులు, సెన్సార్ లేదు. దీంతో పరిమితికి మించిన అశ్లీలతని, అసభ్యతని ప్రసారం చేస్తున్నాయి. బూతులు డైలాగులతో పాటు సన్నీవేశాలను సైతం అడ్డుఅదుపు లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే.. ట్రెండ్‌ని ఫాలో అవుతూ దగ్గుబాటి హీరోలైన బాబాయ్ వెంకటేశ్ (Venkatesh), అబ్బాయి రానా (Rana) ఓటీటీకి డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరు కలిసి తండ్రికొడుకులుగా ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైన ఈ సిరీస్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళుతోంది. అయితే.. ఈ వెబ్‌సిరీస్‌లో పరిమితికి మంచి అశ్లీల దృశ్యాలు, అసభ్య పదజాలం ఉన్నాయి. అది చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల ఆగ్రహానికి కారణమైంది. అందుకే దగ్గుబాటి హీరోలను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ప్రముఖ నటి విజయశాంతి (Vijayashanti) సైతం ఈ సిరీస్‌పై స్పందిస్తూ.. దగ్గుబాటి హీరోలపై పరోక్షంగా ఫైర్ అయ్యారు.

విజయశాంతి సోషల్ మీడియాలో చేసిన పోస్టులో.. ‘ఇటీవలే విడుదలైన ఓ తెలుగు ఓటీటీ సిరీస్ చూసిన తర్వాత.. ఓటీటీలలో వచ్చే కంటెంట్‌కి కూడా కఠినమైన సెన్సార్‌ విధానం ఉండాలని అర్థమైంది. మహిళా వ్యతిరేకత తీవ్రమై ఉద్యమాల చేసే వరకు తెచ్చుకోకుండా ఉంటారని అనుకుంటున్నా. ఆ సిరీస్‌ను ఓటీటీలో నుంచి తొలగించాలని నటులు, నిర్మాతలను కోరుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో మహిళల నుంచి వ్యతిరేకతకి కారణం కాకుండా.. జాగ్రత్త ఉంటారని ఆశిస్తున్నా. ప్రజల అభిమానాన్ని గౌరవంతో నిలబెట్టుకుంటారని భావిస్తున్నా’ అని రాసుకొచ్చారు. అయితే.. ఈ పోస్టులో డైరెక్ట్‌గా రానా నాయుడు పేరు మాత్రం రాయలేదు. కానీ.. ఆ పోస్ట్ ఆ వెబ్‌సిరీస్ గురించేనని అందరికీ అర్థం అవుతోంది. దీంతో ఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ ‘మీరు చెప్పింది నిజం మేడమ్’ అంటూ ఆమెకి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

%d