విమానం సినిమాలో అనసూయ అందాల ఆరబోత

అనసూయ భరద్వాజ్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీ. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘విమానం’ రెడీ అవుతోంది. జీ స్టూడియోస్ – కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో అనసూయ గ్రామీణ యువతిగా కనిపించనుంది .. ఆమె పాత్ర పేరు సుమతి. ఈ రోజున ఈ సినిమా నుంచి అనసూయకి సంబంధించిన గ్లింప్స్ ను .. పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆమె చాలా సెక్సీగా కనిపిస్తోంది. ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండనుందనే విషయం పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది.
For More News Click: https://eenadunews.co.in/
ఇది తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే కథ. తండ్రిగా వీరయ్య పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడు. ఆయన కొడుకు పాత్రను మాస్టర్ ధృవన్ పోషించాడు. రాజేంద్రన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.

Leave a Reply

%d