విశాఖలో ఇనార్బిట్‌ మాల్‌

ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖలో రహేజా గ్రూప్ రూ. 600 కోట్ల పెట్టుబడులకు  ముందుకొచ్చింది. ఈ పెట్టుబడులపై రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రహేజా గ్రూప్ ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం చేపట్టానున్నట్లు సీఎం జగన్ కు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన ఈ భేటీలో రహేజా గ్రూప్ పెట్టుబడులపై కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్ తో చర్చించారు.  ప్రస్తుతం చేపట్టనున్న ఇనార్బిట్‌ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు సీఎంను రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా ఆహ్వానించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Leave a Reply

%d