ప్రీతి హత్య వెనుకు ఉన్నది వారే – తండ్రి

కేఎంసీ మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ ఆత్మహత్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెది ఆత్మహత్యనే అని, అయితే ఇందుకు సైఫ్ ప్రధాన కారణమని సీపీ రంగనాథ్ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు శనివారం సీపీని కలిశారు. అనంతరం తండ్రి మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్యే అని తాము నమ్ముతున్నామని చెప్పారు. కేసు దర్యాఫ్తు కూడా నిష్పక్షపాతంగానే జరుగుతోందని నమ్ముతున్నామన్నారు. అయితే ఛార్జీషీటులో ఇంకా కొందరి పేర్లను చేర్చాల్సిందని, వారు కూడా చేర్చుతామని చెప్పారన్నారు.

కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడీల బాధ్యతారాహిత్యం కనిపిస్తోందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరామన్నారు. ఈ కేసు పైన ఉన్న సందేహాలను సీపీని అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ప్రీతిది ఆత్మహత్య అని చెబుతూ, కొన్ని ఆధారాలను చూపించారన్నారు. త్వరలో ఛార్జీషీటును దాఖలు చేయనున్నట్లు చెప్పారు.

కాగా, ప్రీతి మృతి కేసులో పోస్టుమార్టం నివేదిక వివరాలను వరంగల్ సీపీ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. తాజా రిపోర్ట్ ప్రకారం ఆమెది ఆత్మహత్య అని తేలిందని, అయితే సైఫ్ వేధింపుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పారు. కాగా, ఇటీవల సైఫ్ కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: