ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో వెస్టిండీస్ కు ఊహించని షాక్ తగిలింది. క్వాలిఫయర్ సూపర్ సిక్స్ లో వరుసగా ఓడిపోయి, టోర్నీ నుంచి ఔట్ అయింది. సూపర్ సిక్స్ లో భాగంగా.. శనివారం స్కాట్లాడ్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 44 ఓవర్లకు 181 పరుగులు చేసి కుప్పకూలింది. టీంలో హోల్డర్ (45), రోమియో షెపర్డ్ (36) మినహా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రాణించలేదు. స్కాట్లాండ్ బౌలర్ల దాటికి.. చార్లెస్, శమార్హ్ బ్రూక్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఓపెనర్ బ్రాంబన్ కింగ్ (22), పూరన్ (21) నిలబడలేకపోయారు. దాంతో 181 పరుగులకే విండీస్ కుప్పకూలింది. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాండన్ మెక్ మెల్లెన్ కు 3 వికెట్లు దక్కాయి. క్రిస్ సోల్, మార్క్ వాట్, గ్రీవ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. షరీఫ్ కు ఒక వికెట్ దక్కింది. అయితే గతంలో రెండు సాార్లు వెస్టిండీస్ ప్రపంచ కప్ సాధించింది.
వరల్డ్ కప్ నుండి వెస్టిండీస్ ఔట్
