అనసూయతో విజయ్ దేవరకొండ గొడవ దానికోసమా ?

ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ.. నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్‌ రెడ్డి సినిమా టైంలో మొదలైన గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా అనసూయ.. విజయ్‌ దేవరకొండను టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. తాజాగా కూడా ఆమె విజయ్‌ దేవరకొండపై సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారు. రెండు రోజుల క్రితం విజయ్‌ దేవరకొండ నటించిన ఖుషీ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. పోస్టర్‌ మీద విజయ్‌ పేరు.. ది విజయ్‌ దేవరకొండ అని ఉంది. దీనిపై అనసూయ స్పందించారు.

For More News Click: https://eenadunews.co.in/
‘‘ ఇప్పుడే ఒకటి చూశాను. ది(The) నా.. బాబోయ్‌.. ఏం చేస్తాం.. పైత్యం.. అంటకుండా చూసుకుందాం’’ అంటూ ట్వీట్‌ పెట్టారు. దీంతో చాలా నెలల తర్వాత మళ్లీ రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ దేవరకొండ, అనసూయ భర్తకు సంబంధించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. కొన్ని నెలల క్రితం ఓ సినిమా ఫంక్షన్‌లో అనసూయ భర్త సుశాంక్‌ భరద్వాజ్‌.. విజయ్‌ దేవరకొండతో గొడవ పెట్టుకున్నారట. వీరిద్దరి మధ్యా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తన సినిమా గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారట.
తన భర్తతో గొడవ పెట్టుకోవటంతో విజయ్‌ మీద అనసూయకు కోపం ఇంకా పెరిగిందని తెలుస్తోంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా టార్గెట్‌ చేసి కామెంట్లు చేస్తోందని ఓ చర్చ బాగా నడుస్తోంది. అయితే, అనసూయ భర్త సుశాంక్‌ భరద్వాజ్‌.. విజయ్‌ దేవరకొండల మధ్య గొడవ జరిగిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. విజయ్‌నుంచి కానీ, అనసూయ వైపునుంచి కానీ, ఓ అధికారిక ప్రకటన వస్తే గానీ, ఈ విషయంలో నిజం ఎంతుందో తెలీదు. ఈ పుకార్లకు రెండు వర్గాలు ఎలాంటి ముగింపు నిస్తాయో వేచి చూడాల్సిందే. మరి, అనసూయ భర్త సుశాంక్‌ భరద్వాజ్‌.. విజయ్‌ దేవరకొండల మధ్య వివాదం జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

%d bloggers like this: