పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

గత కొంతకాలంగా నరేష్,  పవిత్ర లోకేష్ కి సంబంధించిన ప్రతి విషయం సెన్సేషనల్ న్యూస్ గా మారుతున్న విషయం తెలిసిందే.  సోషల్ మీడియాలో ఈ జంట ట్రెండింగ్ గా మారారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఈ జంట రిలేషన్ లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో రకాల వార్తలు పుట్టుకువచ్చాయి. కానీ అదంతా సినిమా కోసం అంటూ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా నరేష్, పవిత్ర కలిసి నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నటుడు నరేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

For More News Click: https://eenadunews.co.in/

సినీ ఇండస్ట్రీలో నటుడు నరేష్ కి కమెడి హీరోగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.. కొంతకాలంగా తండ్రి, మామ ఇతర పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో ఆయన సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరిపై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.. వాటన్నింటికి గుడ్ బాయ్ చెబుతూ తాము పెళ్లి చేసుకున్నాం అంటూ ఫోటోలను, పెళ్లి వీడియోను షేర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. అయితే అదంతా ఈ జంట నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ మూవీ ప్రమోషన్ అని ట్విస్ట్ ఇచ్చారు. ఈ మూవీకి ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

For More News Click: https://eenadunews.co.in/

నటుడు నరేష్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న మూవీ ‘మళ్లీ పెళ్లి’. అయితే ఇది తన బయోగ్రఫీ కాదని అంటున్నారు నరేష్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ జోరుగా సాగుతుంది. ప్రమోషన్ లో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో నరేష్, పవిత్ర లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. తమ పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. భూమి బద్దలైనా.. ఆకాశం విరిగిపడినా.. మేం ఇద్దరం కలిసే ఉంటాం. మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి.. మనసులు కలిశాయి.. అందుకే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. అందరి ఆశీర్వాదంతో త్వరలో పవిత్రను పెళ్లి చేసుకుంటా అన్నారు నరేష్.

For More News Click: https://eenadunews.co.in/

మనసులు కలిసిన వారికి పెళ్లి అనేది ఖచ్చితంగా అవసరం కాదు.. చాలా మంది ఇష్టం లేకపోయినా.. సొసైటీలో పెళ్లి అనే బంధంతో ఒక్కటిగా ఉంటారు. అలాంటి వారి కోసమే మా ఈ ‘మళ్లీ పెళ్లి’ మూవీ. వాస్తవానికి ఇది మా బయోపిక్ మాత్రం కాదు.. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు.. కానీ త్వరలో ఖచ్చితంగా చేసుకుంటాం.. అని అన్నారు నరేష్. ఇదిలా ఉంటే తమ స్టోరీ కాదని అంటూనే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ పెళ్లి మూవీ ట్రైలర్ తో సినిమాపై మంచి అంచానలు పెంచారు. తాజాగా నటుడు నరేష్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Leave a Reply

%d