నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది. కోవిడ్-19 వల్ల గత రెండేళ్లు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరిగిన వేడుకలను ఈసారి ఎంతో ఉత్సహంగా నిర్వహించాలనుకుంటే మళ్లీ కోవిడ్ భయం పట్టుకుంది. అయితే ఈ ఏవి పట్టించుకొని సర్కార్ మాత్రం ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అక్కడక్కడ కాస్తా పరిమితులు పెట్టినా… మందుబాబులకు మాత్రం ఓపెన్ ఆఫర్ పెట్టింది. రోజు పదింటికే మూసే వైన్ షాపులు, బార్లను నూతన సంవత్సరం సందర్భంగా, డిసెంబర్ 31 రోజున రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రాత్రి 1 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఎక్సైజ్ & సిటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.
అర్థరాత్రి వరకు వైన్ షాపులు, బార్లు తెరిచే ఉంటాయి
