ఒంటరిగా ఉన్న ఓ మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బలవంతంగా లిప్ కిస్ ఇస్తుంటే.. అతని పెదాలను గట్టిగా కొరికేసింది. దీంతో కింది పెదవి తెగి పడిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని దరౌలా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. పొలంలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని ఓ యువకుడు గమనించాడు. ఇక ఆమె వద్దకు వెళ్లి బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచారానికి యత్నించాడు. లిప్ కిస్ ఇస్తుండగా, అతని పెదాలను మహిళ తన పళ్లతో గట్టిగా కొరికింది. దీంతో ఆ యువకుడి కింది పెదవి పూర్తి తెగి పడిపోయింది.
ఇక మహిళ అరుపులు విన్న స్థానిక రైతులు.. అక్కడికి చేరుకున్నారు. యువకుడిని బంధించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారానికి యత్నించిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.