సాధారణంగా షాపింగ్ అంటే.. లక్షో రెండు లక్షల్లో మహా అయితే ఐదారు లక్షల్లో ఖర్చు పెడతారు. ఇంకా రిచ్ పీపుల్ అయితే 10 లక్షల వరకు ఖర్చు పెడతారు. కాని దుబాయ్ కి చెందిన ఓ మహిళ ఒక రోజు సరదాగా షాపింగ్ కు వెళ్లి 73 లక్షలతో షాపింగ్ చేసింది. అంతే కాదు ఆమె తన షాపింగ్ వివరాలతో పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుబాయ్‌కి చెందిన సౌదీ అనే మహిళ తన భర్త డబ్బును షాపింగ్‌కు ఖర్చు చేయడం విలాసవంతమైన హాబీగా పెట్టుకుంది. అయితే ఆమె తన జీవన విధానాన్ని లగ్జరీ లైఫ్ అనుభవాలను సోషల్ మీడియాతో పంచుకుంది. అయితే ఒకే రోజు 73 లక్షల విలువైన షాపింగ్ చేశానని తెలిపింది.
For More News Click: https://eenadunews.co.in/
సౌదీకి డియోర్ అనే డిజైనర్లు , ఆమె భర్త జమాల్ ఎమిరాటీ హీర్మేస్‌ను ఇష్టపడతారు. వారు ఎక్కువుగా విదేశీ టూర్లకు వెళుతుంటారు. మాల్దీవులకు ఎక్కువుగా వెళ్తుంటారు. తరచుగా లండన్ వెళ్తారు. తాజాగా సీషెల్స్ నుంచి వచ్చారట. ఇప్పుడు జపాన్ కు వెళ్లాలని ప్లాన్ చేశామని చెప్పారు దుబాయ్ మహిళ సౌది
For More News Click: https://eenadunews.co.in/
సౌదీ ఆరేళ్ల వయస్సు వరకు ససెక్స్‌లోఉండి ఆ తర్వాత ఆమె కుటుంబం దుబాయ్‌కి వెళ్లింది. ఆమె భర్త జమాల్ ఎమిరాటీ. తనకు సర్ ఫ్రైజ్ లు అంటే చాలా ఇష్టమని సౌదీ చెప్పింది. ఒక రోజు జమాల్ ఖరీదైన రెస్టారెంట్ ను రోజుకు లక్షా 10 వేల రూపాయిల విలువైన దానిని తీసుకుంటారట. అంతే కాకుండా 20 లక్షల విలువైన బహుమతి ఇచ్చి రాత్రి సమయంలో అక్కడ గడిపామని సౌదీ చెప్పారు. జమాల్ ఆమెకు ఒక బిర్కిన్ బ్యాగ్ , రెండు కార్లను బహుమతిగా ఇచ్చాడు. సౌదీ బేసిక్ ఫిల్లర్ , బొటాక్స్ చేయడంతో ఎంతో ఆనందంగా గడిపామని తెలిపింది. ఈ జంట దుబాయ్‌లోని యూనివర్సిటీలో కలుసుకొన్న రెండేళ్ల తరువాత వివాహం చేసుకున్నామని సోషల్ మీడియాకు సౌదీ తన పర్సనల్ విషయాలను కూడా తెలిపింది.