చంద్రబాబుతోనే మహిళా సాధికాారత

తెలుగుదేశం పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం “మహాశక్తి” మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా తాడికొండ నియోజకవర్గం ఇంచార్జీ  తెనాలి.శ్రావణ్ కుమార్ గారి ఆదేశాలతో తాడికొండ నియోజకవర్గ మహిళా కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ రిజ్వానా గారు, గుంటూరు పార్లమెంట్ అంగన్వాడి డ్వాక్రా అధ్యక్షురాలు షేక్ జానీ బేగం గారు, తాడికొండ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మైనేని. గిరిజ గారు , గుంటూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శి బండ్లమూడి. ప్రియాంక గారు మరియు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న తెలుగు మహిళలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

%d