మగాడి వేషంలో వచ్చి అత్తపై కోడలు ఏం చేసిందంటే ?

సాధారణంగా ప్రతి ఇంట్లో అత్తా, కోడళ్లు ఏదో రకంగా పోట్లాడుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరు అస్తమానం తిట్టుకుంటూనే ఉంటారు. కొందరు అత్తలు కోడళ్లను కొడుతుంటారు కూడా. అత్తాకోడళ్లకు పడక వేరు కాపురం పెట్టడం చాలా ఇళ్లలో జరుగుతోంది. ఈ గొడవలు ఓ లెవల్‌ వరకు బాగానే ఉంటాయి. హద్దులు మీరితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అదే గొడవలు తారాస్థాయికి చేరితే చంపుకునే వరకు వెళుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైం స్టోరీలో ఓ కోడలు మగవేషంలో వచ్చి అత్తపై దాడి చేసింది. ఈ దాడిలో అత్త చనిపోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

For More News Click: https://eenadunews.co.in/

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు తిరున్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో షణ్ముగవేల్, సీతారామలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కొడుకు రామస్వామి, కోడలు మహాలక్ష్మి ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సీతారామలక్ష్మి, మహాలక్ష్మి తరచూ గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. గొడవల కారణంగా కోడలు మహాలక్ష్మి తనభర్త, పిల్లలతో వేరు కాపురం పెట్టుకుంది. అయినప్పటికి గొడవలు ఆగలేదు. గత పదిరోజులుగా గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అత్తపై కోపంతో మహాలక్ష్మి ఎలాగైనా అత్తను హతమార్చాలని ప్లాన్ వేసింది. ఈనెల 29న అర్థరాత్రి మగాడిలా వేషం ధరించి సీతారామలక్ష్మిపై దాడిచేసి బాగా కొట్టింది. అంతటితో ఆగకుండా బంగారు గొలుసు లాక్కుని పారిపోయింది.

అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అత్తను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అత్త సీతారామలక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనపై షణ్ముగవేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేసినట్లు.. దాడిలో అత్త చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసింది. సీసీ పుటేజ్ లను పరిశీలించగా కోడలు మహాలక్ష్మి అత్తపై దాడికి పాల్పడిందని తేలింది. ఆ తర్వాత పోలీసులు కోడలిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లలో తెలియజేయండి.

Leave a Reply

%d bloggers like this: