లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని కావాలని కొంత మంది టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న టైమ్ లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఆయన కొంతమంది నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసులో సీబీఐ విచారణను ఎదురుకుంటున్నారు. సీబీఐ ఆయన్ను మరోసారి విచారించింది. దీనిపై ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని నిత్యం వేధిస్తున్నారని, ఆయనకు ఏమైనా అయితే ఎవర్నీ వదిలేదు లేదని హెచ్చరించింది. లాలూకు ఏమైనా అయితే ఢిల్లీ పీఠాన్ని కదిలించే శక్తి తనకు ఉందని వార్నింగ్ ఇచ్చారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని దాన్ని కూడా పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం లాలూ ప్రసాద్ ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చారు. రోహిణినే ఆయనకు కిడ్నీ దానం చేశారు.
ఢిల్లీ పీఠం కదిలించే శక్తి నాకుంది – రోహిణీ ఆచార్య
