హోంమంత్రి వనితపై గళమెత్తిన వైసీపీ అసమ్మతి వర్గం

మరోసారి హోం మంత్రి తానేటి వనితపై వైసీపీ అసమ్మతి వర్గం గళమెత్తింది. తానేటి వనిత వద్దు జగనన్న ముద్దు – కార్యకర్తలు రక్తం తాగిన వారు వద్దు అని సోషల్ మీడియాలో దొమ్మేరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చిన్నం హరిబాబు పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వర్గాలను రెచ్చగొట్టినందుకుగాను.. చిన్నం హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు మంత్రి వ్యతిరేక వర్గం చేరుకుంది. మాలలను చిన్నచూపు చూస్తున్నారని ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మాజీ ఎంపీ హరీష్ కుమార్ చేరుకున్నారు. నాయకులు ఈ విషయమై డీఎస్పీతో చర్చించారు. 41 సీఆర్పీసీ ఇచ్చి హరిబాబును పోలీసులు విడుదల చేశారు.

Leave a Reply

%d bloggers like this: