ఆనంపై వేటు వేసిన వైకాపా

ఆనం రాంనారాయణ రెడ్డి వైకాపా క్రమ శిక్షణ చర్యలు చేపట్టింది. ఇటీవల ఆయన పార్టీపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో  వెంకటగిరి నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి పదవి నుంచి ఆనంను తొలగించారు. ఆయన స్థానంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి నూతన ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు వైసీపీ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకలాపాలన్నీ ఇకపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతాయన్నది ఆ ప్రకటన ద్వారా చెప్పారు.  అయితే ఈ మార్పుపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆనం రామనారాయణరెడ్డి అంటున్నారు. దీనిపై ఆయన తదుపరి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.  కాగా, ఆనం ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకత్వం చాలా వరకు వేచి చూసే ధోరణి అవలంబించింది. వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో సీఎం జగన్ పార్టీ ముఖ్యనేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆనంపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపించారు.

Leave a Reply

%d