వైకాపాకు బాలినేని రాజీనామా ?

వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గత వారం రోజులుగా ఈ ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించిన నేపథ్యంలో ఆయన అసంతృప్తికి గురయ్యారని చెపుతున్నారు. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో బాలినేని స్పందించారు. వైసీపీ పుట్టినప్పటి నుంచి తాను ఇదే పార్టీలో ఉన్నానని చెప్పారు. పార్టీ మారుతున్నానని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని చెప్పారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. జగనే తనకు నాయకుడని, ఆయన నాయకత్వంలోనే తాను పని చేస్తానని అన్నారు.

 

Leave a Reply

%d