పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాని

ఏపీలో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. రాజకీయాలు అంటే హుందాగా సాగాల్సినవి కాస్తా… వ్యక్తిగతంగా మారుతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత మరింత పెచ్చరిల్లుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకోవాలి. ఏపీలో ఇప్పటికే వైకాపా వెన్నులో వణుకు పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైకాపా నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ షోకు పవన్ వెళ్లడం, విజయవాడలో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కార్యక్రమంపై.. మాజీమంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ‘బావతో తిరిగిన పవన్.. బామ్మర్దితో వెళ్తే.. తప్పేం ఉంది. అది కూడా డబ్బులు తీసుకొని చేసే షో. దానికి ముందే స్క్రిప్ట్ రాసిస్తారు. ప్రజలను ఎంటర్‌టైన్ చేయడానికి డబ్బులు తీసుకొని కాసేపు అలా మాట్లాడతారు. అల్లు అరవింద్ పుణ్యమా అని బాలకృష్ణకు మరో అవకాశం ఉంది. అన్ స్టాపబుల్ వేదికగా ఎన్టీఆర్ మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన బావ చేసిన తప్పులను బాలకృష్ణ కప్పిపుచ్చుతున్నారు’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Leave a Reply

%d