ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు..’ కార్యక్రమంలో ఓ ఎమ్మెల్యే చిన్నారులు, మహిళల చేత కాళ్లు కడిగించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి పాదపూజ పేరుతో.. కొందరు ఆయన కాళ్లను చేతులతో కడిగి, వస్త్రంతో తుడిచారు. పెదపూడి మండలం రామేశ్వరంలో గత నెల 30న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దమూడి మండలంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ తంతు జరిగింది.
చిన్నారులతో కాళ్లు కడిగించుకున్న వైకాపా ఎమ్మెల్యే
