వివేకా హత్య కేసులో నేడు కోర్డులో ఎంపీ

సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానం దరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తాను సహకరిస్తున్నప్పటికీ విచారణ అధికారి సరైన విధానాలు అనుసరించడం లేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టును కోరారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘నన్ను మొదటి సారి విచారించినప్పటి నుంచి సీబీఐ అధికారులు అడిగినవి, అడగనివి కూడా చిలువలు పలువులు. చేస్తూ దుష్ప్రచారం చేశారు. కొన్ని రాజకీయ పార్టీ లకు కొమ్ముకాసే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా వేదికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా అవాస్తవాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చాయి. ప్రజల్లో అపోహలు తొలగించేందుకే సీబీఐ విచారణను రికార్డు చేయాలని విచారణ అధికారిని లిఖితపూ ర్వకంగా కోరాను. రెండోసారి విచారణకు పిలిచిన ప్పుడు కూడా రికార్డు చేయాలని సీబీఐ డైరెక్టరు. విచారణ అధికారి రామ్ సింగ్ను లిఖితపూర్వకంగా కోరాను. అయినా పట్టించుకోలేదు. అందుకే తప్ప నిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’ అని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో ఆయన పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు.

వివేకా, సునీత మధ్య మనస్పర్ధలు

2010లో షేక్ షమీ మన్ను వైఎస్ వివేకా రెండో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అప్పటి నుంచి వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. షమీమన్ను సునీత, ఆమె భర్త ఎన్. రాజశేఖరరెడ్డి, బావ ఎన్.శివప్రకాశడ్డి శత్రువుగా చూసేవారు. సునీత రాజశేఖరరెడ్డితో పాటు వివేకా పలు కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. వారు వివేకానందరెడ్డి చెక్ పవర్ను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివేకా మొదటి భార్య. కూతురు హైదరాబాద్లో ఉండగా, ఆయన మాత్రం పులివెందులలోనే ఎక్కువ రోజులు గడిపే వారు. ఒక దశలో ఆయన వారసుడిగా షమీమ్ కుమారుడినే ప్రకటిస్తారని, ఆ మేరకు విల్లు కూడా రాశారని పుకార్లు వచ్చాయి. హత్య అనంతరం నిం దితుల (ఏ1 నుంచి ఏ4) ఇళ్లలో ఈ పత్రాల కోసం: వెతికినట్లు కూడా సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తే… సొంత కుటుంబ సభ్యులే ఆయన్ని వదలించుకునే పథకం వేసినట్లు అర్థమవుతుంది. వివేకా మర ణానంతరం సునీత, ఆమె కుటుంబీకులు బెదిరించి నట్లు షమీమ్ దర్యాప్తు అధికారులకు కూడా చెప్పారు. తన కుమారుడి పేరుమీద రూ.2 కోట్లు బ్యాంక్లో డిపాజిట్ చేస్తానని వివేకా చెప్పినట్లు వెల్లడిం చారు’ అని అవినా రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.

బీటెక్ రవి, చంద్రబాబు ప్రభావంతోనే

‘వివేకా హత్య తర్వాత సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)ని కలిశారు. రవి ద్వారా టీడీపీ అధ్యక్షుడు చం ద్రబాబుతో మంతనాలు జరిపారు. హత్య జరిగిన -సంవత్సరం వరకు సునీత నాపై ఆరోపణలు చేయలేదు. పైగా, ప్రెస్మీట్ పెట్టి నా విజయం కోసం వివేకా చాలా శ్రమించారని, జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని ఆమె చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభావానికి లోనైన తర్వాతే నాపై ఆరోపణలు చేశారు’ అని తెలిపారు

వారికి నచ్చినట్లు దర్యాప్తు

‘దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. సునీల్ యాదవ్ గూగుల్ టేప్డేట్ ఫోన్ లొకేషన్ అనే పేరుతో సీబీఐ నన్ను వేధిస్తోంది. హత్య జరిగిన ప్రాం తంలో దొరికిన లేఖపై దర్యాప్తు చేయటంలేదు. దర్యాప్తు అధికారి తప్పుడు ప్రచారానికి ప్రభా- వితమై ఆ కోణంలోనే, పక్షపాతంతో విచారణ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా కొంద రిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను విచారణ అధికారి మార్చి వారికి అవసరమైనట్లుగా మీడియాకు లీకులిస్తున్నారు. నోటీసుల దశలో దర్యాప్తు సాగుతుం డగా చార్జిషీట్లో నేరస్తునిగా సీబీఐ చిత్రీక రిస్తోంది. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తు ఉన్నారు. అందువల్ల నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా దర్యాప్తు అధికారులను ఆదేశించాలి’ అని అవినాష్ రెడ్డి పిటిషన్లో కోరారు.

నేడు విచారణ

అవినాష్ రెడ్డి పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్సన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేసులు విచా రించే బెంచ్కు పంపారు. ఈ పిటిషన్ ను జస్టిస్, కె. లక్ష్మణ్ బెంచ్ శుక్రవారం విచారించనుంది.

Leave a Reply

%d