తెలంగాణ అసెంబ్లీలో షర్మిల అధ్యక్ష అనే ఛాన్స్ ?

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి చతికిలపడుతూ నెట్టుకొస్తున్న పార్టీ వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్ రాజకీయ వారసురాలిగా తెలంగాణలో అడుగులు వేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్లాన్. అయితే ఇందుకు సానుకూలా పవనాలు వీస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిస్తోంది రాజకీయ వర్గాల్లో. రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా.. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ వ్యతిరేకంగా ఓట్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చిన ఎన్నికల్లో తెరాస అంటే ప్రస్తుత భారస పార్టీకి ఎక్కడా కూడా కనీస మద్దతు కూడా మూటగట్టుకోలేదు. అటు వైకాపా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినవారే ఆ తరువాత భారసలో చేరారు.

అయితే పార్టీ పెట్టినప్పటి నుండి షర్మిల ఖమ్మం జిల్లా మీద పట్టుసాధించాలని చూస్తున్నారు. పాలేరు నుండి పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఖచ్చితమైన గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకంటే తెలంగాణ అసెంబ్లీలో షర్మిల అధ్యక్ష అని అనడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

%d