తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోమారు సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆయన పాపాల చిట్టా అంతా బయటకు వస్తుందని.. పాపాల పుట్ట పగులుతుందన్నారు. కేసీఆర్ నువ్వు చేసిన నేరాలే.. నాగుపాముగా కాటేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారామె. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతిపై.. ఢిల్లీలో కాగ్ ను కలిసి ఆధారాలతో సమర్పించామని.. దానిపై చర్యలకు త్వరలోనే పోరాటం చేస్తామని హెచ్చరించారు షర్మిల. మా పార్టీ కంప్లయింట్ పై అవిశ్రాంత పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేశామని.. త్వరలోనే మంచి ఫలితాలు చూడబోతున్నారన్నారామె. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కాగ్ కు ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా చర్యలు చేపడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ఖాయమన్నారు షర్మిల. త్వరలోనే అది కూడా జరుగుతుందని.. కేసీఆర్ కు జైలు ఖాయం అంటూ జోస్యం చెప్పారామె. ఖబడ్డార్ కేసీఆర్ 420 అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని.. ఇన్నాళ్లు చేసిన పాపాలకు.. అవినీతికి శిక్ష అనుభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారామె. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై చర్యలు తీసుకునే వరకు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అవిశ్రాంత పోరాటం చేస్తామని ప్రకటించారు షర్మిల.